AP: Wife Complained To Police That Her Husband Bit Her Cheek
mictv telugu

బుగ్గ కొరికిన భర్త.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన భార్య

August 10, 2022

భార్యాభర్తలు అన్నాక వారి సంసారంలో చిన్న చిన్న గొడవలు రావడం కామన్. ఎవరో ఒకరు సర్దుకుపోతుంటే ఆ దాంపత్య బంధం అందంగా, అర్ధవంతంగా ఉంటుంది. అలా కాకుండా అవే గొడవలు చిలికి చిలికి గాలివానలా మారితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. తన సంసారంలో జరిగిన ఓ గొడవ గురించి ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త బుగ్గ కొరికేశాడని , వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు బుగ్గ కొరికి గాయపర్చిన భర్తపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది ఈ విచిత్ర సంఘటన.

కానూరు కేసీపీ కాలనీకి చెందిన స్రవంతి, రాంబాబులు భార్యాభర్తలు. భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ మధ్య అతను మద్యానికి బానిసయ్యాడు. రోజూ మందు తాగి వచ్చి భార్యను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో గొడవ పడ్డాడు. వారిద్దరి మధ్య వివాదం మరింతగా ముదిరింది. కోపంతో ఊగిపోయిన రాంబాబు స్రవంతి బుగ్గను కొరికేశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.