ఏపీలో మద్యం ప్రియులకు అదిరిపోయే ఆఫర్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మద్యం ప్రియులకు అదిరిపోయే ఆఫర్లు..

September 12, 2019

AP Wine Shops.

మందుబాబులకు ఏపీలో భలే ఆఫర్లు ప్రకటించారు మద్యం షాపు యజమానులు. ప్రతి మద్యం బాటిల్‌పై ఎంతో కొంత ఆఫర్ ఇస్తూ తమ స్టాక్ అమ్మేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి ఆఫర్లు కనిపిస్తున్నాయి. రూ. 2వేల ఖరీదు చేసే మద్యంపై ఏకంగా రూ. 300 వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఎక్కువ మొత్తంలో మద్యం కొనేవారికి లెదర్ బ్యాగులు, ఖరీదైన గ్లాసులు, ఇలా రకరకాల గిఫ్ట్‌లు ఇస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వారు వైన్‌షాపుల వద్ద క్యూ కట్టి లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. 

ఈ ఆఫర్ పెట్టడానికి కొత్తగా అమలులోకి వచ్చిన మద్యం పాలసీ కారణమని నిర్వాహకులు చెబుతున్నారు. అక్టోబర్ 1 నుంచి మద్యం విక్రయాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్నాయి. దీంతో ప్రైవేటు నిర్వాహకులు తమవద్ద ఉన్న సరుకును క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. ఒకవేళ సరుకు మిగిలిపోతే దాన్ని తిరిగి ఎక్సైజ్ శాఖకు అప్పగించాలి. కానీ దానివల్ల ఎటువంటి డబ్బు తిరిగి చెల్లింపు ఉండదు. కాబట్టి ఎంతో కొంత ధరకు అమ్మేస్తున్నారు. మరోవైపు కొంత మంది గతంలో చేసినట్టుగా ఒకేసారి సరుకు ఆర్డర్ ఇవ్వకుండా అవసరాన్ని బట్టి మద్యం తెప్పించి అమ్మకాలు జరుపుతున్నారు. తాజా ఆఫర్లతో వైన్ షాపులు కిటకిటలాడుతున్నాయి.