యువకుడిని చితక్కొట్టిన ఏపీ యువతి.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

యువకుడిని చితక్కొట్టిన ఏపీ యువతి.. వీడియో వైరల్

April 29, 2022

ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ, వారిని లైంగికంగా వేధిస్తున్నారు. ప్రేమిస్తున్నాను అంటూ మహిళలను ఫాలో అవుతూ వారిని ఇబ్బందిపెడుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో విధులు ముగించుకొని, రాత్రిపూట ఇంటికి వెళ్తున్న యువతి పట్ల ఓ పోకిరి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. బైక్‌పై వెళ్తున్న యువతిని అడ్డగించి వేధించాడు. దాంతో ఆ యువతి ఆగ్రహంతో రగిలిపోయి, అందరు చూస్తుండగానే నడిరోడ్డుపై ఆ యువకుడిని చితక్కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

ఆ వీడియోలో.. యువ‌కుడిని కింద ప‌డేసి, క‌ర్ర‌తో కొడుతూ, ఏమి కావాలి నీకూ, ఎందుకు ఫాలో అవుతున్నావు. మీలాంటి వాళ్ల వల్ల ఆడవాళ్లు ఎలా బతకాలి చెప్పు అంటూ ఆ యువతి ప్రశ్నిస్తూ కర్రతో ఆ పోకిరీకి బుద్ది చెప్తుంది. ఈ వీడియోను వాసిరెడ్డి పద్మ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా బైక్‌ను అడ్డగించి, వేధించిన దుండగుడిని కర్రతో చితక్కొట్టిన ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్’ అంటూ పేర్కొంది.