మలయాళ హీరోయిన్ అపర్ణ బాలమురళికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెతో స్టూడెంట్ అనుచితంగా ప్రవర్తించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాశమే నీ హాద్దురా సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ అపర్ణ బాలమురళి.. ప్రస్తుతం తాంకం పేరుతో మలయాలంలో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ కాలేజీని చిత్ర యూనిట్ సందర్శించింది.
A college student misbehaved with actress Aparna Balamurali during the promotion function of Thangam movie. @Vineeth_Sree I'm surprised about your silence 🙏 What the hell #Thankam film crew doing there.
@Aparnabala2 #AparnaBalamurali pic.twitter.com/icGvn4wVS8— Mollywood Exclusive (@Mollywoodfilms) January 18, 2023
ఈ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అపర్ణ బాలమురళి భుజంపై చేయివేయడానికి ప్రయత్నించాడు. తొలుత ఆమెకు ఫ్లవర్‌తో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ ఆ తర్వాత ఆమె భుజంపై చేయివేశాడు. అతడి ప్రవర్తనతో అపర్ణ బాలమురళి ఇబ్బందిగా ఫీలయ్యింది. ఆ స్టూడెంట్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో చిత్ర యూనిట్‌తో పాటు కాలేజీ యాజమాన్యం ఉన్న ఆ స్టూడెంట్ చేస్తోన్న పనిని అడ్డుకోకపోవడంపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు. అపర్ణ బాలమురళికి సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
అయితే ఆ స్టూడెంట్ క్షమాపణ అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో బిజీ హీరోయిన్గా కొనసాగుతోన్న అపర్ణ బాలమురళి ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్‌తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ధూమంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా మరో ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంచి జోరుమీదుంది.