అపార్ట్‌మెంట్ అంటే ఇలా ఉండాలి.. ఎటు చూసినా చెట్లే..! - MicTv.in - Telugu News
mictv telugu

అపార్ట్‌మెంట్ అంటే ఇలా ఉండాలి.. ఎటు చూసినా చెట్లే..!

October 15, 2019

నగరాల్లో అపార్ట్ మెంట్లలో నివాసానికి అలవాటు పడి పర్యావరణానికి దూరమై బతుకుతున్నాం. స్వచ్చమైన గాలి అనేది అతి కష్టంగా మారింది. కానీ అటువంటి వాటికి చెక్ పెట్టేందుకు ఇటలీలోని ఓ అపార్ట్‌మెంట్‌ను వనంలా మార్చేశారు. 111 మీటర్ల ఎత్తులో ఉన్న దీనిపై మొత్తం మొక్కలనే ఎంతో స్మృజనాత్మకంగా నాటారు. ఎటు చూసిన చోట్ల పొదలతో ఓ వనంలా కనిపిస్తుది.

Apartment.

మిలాన్‌లో ఏర్పాటు చేసిన ‘రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిమోనా పిజ్జి’ అపార్ట్‌మెంట్ పై మొత్తం 900కు పైగా చెట్లు, 5 వేలకు పైగా పొదలు, 11 వేలకు పైగా మొక్కలున్నాయి. దీంతో ఎండా కాలం కూడా కూల్ కూల్‌గా ఈ అపార్ట్‌మెంట్ ఉంటుంది. అంతే కాదు స్వచ్ఛమైన గాలి పూల సువాసనలు వస్తుంటాయి.అంతేకాదు పలురకలా పక్షులు, సీతాకోకచిలుకలు విపరీతంగా ఉన్నాయి. ఈ విధానం చూసిన వారంతా ఎంతో ఆశ్చర్యపోతున్నారు. కేవలం చెట్లను పెంచితే గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించలేమని, ఇలాంటి పద్ధతులూ కాస్త ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2030 నాటికి ప్రపంచంలోని 60 శాతం మంది ప్రజలు సిటీల్లోనే ఉంటారు కాబట్టి ఇటువంటి విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.