బాబుకు బ్యాడ్ డేస్..! - Telugu News - Mic tv
mictv telugu

బాబుకు బ్యాడ్ డేస్..!

July 18, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయా..?కేంద్రంలో ఇక తాన మాట చెల్లుబాటు కాదా…?నిత్యం తోడునీడై అన్నింట్లో సహకరించే బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు కేబినెట్ నుంచి ఉపరాష్ట్రపతి పదవి బాట పట్టడం బాబుకు మైనస్ అవుతుందా..?మునుపటిలాగే బాబు ప్రధాని మోదీ ని ఒప్పించగలుగుతారా…?భవిష్యత్ లో ఏపీ విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోంది.?

అటు వెంకయ్యనాయుడు..ఇటు చంద్రబాబు నాయుడు ఏపీకి రెండు కళ్లు. పార్టీలు వేరైనా ఇద్దరిది ఒకటే పంథా. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని రాబట్టడంలో బాబుకు వెంకయ్య సహకారం చాలా ఉండేది. ప్రతి విషయంలో ఏపీ మనది…అప్పుల్లో ఉన్నది…ఎలాగైనా గట్టెక్కించాలి. ప్రత్యేక హోదా ఎలాగూ ఇవ్వలేకపోయామని…దీంతో చేయాల్సినంతా సాయం చేద్దామని వెంకయ్యనాయుడు ప్రతి విషయంలో అలాగే ఆలోచించారు. పేరుకు బీజేపీ కేంద్ర మంత్రి అయినా టీడీపీ నేతలకన్నా ఏపీ ప్రయోజనాల్ని గురించి ఎక్కువగా ఆలోచించేవారు.తన సీనియారిటీతో ఢిల్లీలో చక్రం తిప్పారు. అన్ని ఆఫీసులు తిరుగుతూ ఫైళ్ల వేగాన్ని పెంచేవారు. చంద్రబాబు కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య అయినా వెంకయ్యనాయుడుకే నివేదించేవారు. అక్కడి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేవారు. చివరకు తాను అనుకున్న పని అనుకున్న టైమ్ లో చేయించుకునే వారు.

ఇక పార్టీ విషయంలో కూడా వెంకయ్యనాయుడు ఏపీ బీజేపీ నేతలను తమ కంట్రోల్ ఉంచుకునేవారు.ఎక్కడా బాబుతో క్లాష్ రాకుండా కమలనాయకుల్ని నడిపించేశారు. ఇదంతా నిన్నటి దాకా…ఇప్పుడు చంద్రబాబు ఒంటరి…పెద్ద నాయుడి దోస్తీ దాదాపు కట్ అయినట్టే…ఉపరాష్ట్రపతి అయ్యాక వెంకయ్యనాయుడు మునపటిలా ఏపీ విషయాల్లో వేలు పెట్టే అవకాశం ఉండదు. అందుకే పెదబాబు చంద్రబాబుకు బ్యాడ్ డేస్ స్టార్ట్ అయినట్టే.

బీజేపీ ఏపీ కేడర్ కార్యకర్తలు ఇక ముందు రెచ్చిపోవచ్చు..ఇంతకుముందులా ఏలాంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు..అటు సౌతిండియాపై కన్నేసిన మోదీ- అమిత్ షా ద్వయం సపోర్ట్ ఎలాగూ ఏపీ బీజేపీ కేడర్ కు ఉంటోంది. సో తోకజాడిస్తే బీజేపీ హైకమాండ్ బాబుLI ఎట్టిపరిస్థితుల్లోనూ వదలదు.

ఈ పరిస్థితిలో చంద్రబాబు కూడా మునుపటిలా దూకుడుగా ఉండకపోవచ్చు. కొన్నాళ్లు కేంద్రంతో సర్దుకుపోవచ్చు. అవకాశం వస్తే మాత్రం జై థర్డ్ ఫ్రంట్ అనొచ్చు.అందుకే మోదీ -అమిత్ షా ఏపీ రాజకీయాల్లో విపక్ష జగన్ ను లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉంచుతున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అగ్రనేతలతో టచ్ లో ఉంటున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుందన్నది ఎందంటే ఏపీ రాజకీయాలపై అమిత్ షా సీరియస్ లుక్ పెట్టారు. అందుకే అడ్డొస్తాడని భావించి వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించేలా చేశారు. ఇష్టం లేకపోయిన తప్పక వెంకయ్య కూడా హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గారు. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేశారు. సో ఏపీ రాజకీయాల్లో వెంకయ్య చాప్టర్ క్లోజ్. బాబు బ్యాడ్ టైమ్ స్టార్ట్