ఎయిడ్స్‌లో ఏపీనే ఫస్ట్.. ఎయిడ్స్ నివారణ సంస్థ - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిడ్స్‌లో ఏపీనే ఫస్ట్.. ఎయిడ్స్ నివారణ సంస్థ

April 25, 2022

ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వ్యాధికి నేటివరకు సరైన మందు లేదు. నివారణ ఒక్కటే మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధిపై అనేక కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పించాయి.

అయితే, ఇటీవలే ఎయిడ్స్ నివారణ సంస్థ చేపట్టిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎయిడ్స్ బాధితులు ఎక్కువగా ఉన్నారని నివారణ సంస్థ తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం.. కండోమ్స్ వాడకుండా శృంగారంలో పాల్గొనటం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరోకరికి అంటుకుంటుందని సర్వే తెలిపింది. తాజా సర్వే ప్రకారం..’మన దేశంలో గత పదేళ్లలో 17.08 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడ్డారు. 2011 నుంచి 2021 మధ్య కాలంలో 17,08,777 మందికి ఎయిడ్స్ సోకింది.

ఏపీలో గత పదేళ్లలో 3,18,814 మందికి ఎయిడ్స్ సోకింది. అత్యధిక ఎయిడ్స్ కేసుల జాబితాలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి” అని ఎయిడ్స్ నివారణ సంస్థ తెలిపింది.

మరోపక్క గతకొన్ని సంవత్సరాలుగా ఎయిడ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య గత దశాబ్ద కాలంగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2011-12 మధ్య కాలంలో 2.4 లక్షల మంది ఎయిడ్స్ బారినపడగా, 2020-21 మధ్య కాలంలో ఆ సంఖ్య 85,268కి పడిపోయింది. ఇటీవలే మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఎయిడ్స్ నివారణ సంస్థ సమాధానం చెప్తూ, తాజా లెక్కల ప్రకారం ఏపీలోనే ఎక్కువమంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని వెల్లడించింది.