తండ్రి రెండోపెళ్లి వల్లే సుశాంత్ ఆత్మహత్య అంటూ.. రచ్చరచ్చ.. - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి రెండోపెళ్లి వల్లే సుశాంత్ ఆత్మహత్య అంటూ.. రచ్చరచ్చ..

August 10, 2020

Apologise Or Face Legal Action! Sushant Singh Rajput’s Family To File Defamation Case Against Shiv Sena’s Sanjay Raut For Late Actor's Father's Second Marriage Claim!.

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై రాజకీయంగా రచ్చ రచ్చ నడుస్తోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ రెండో పెళ్లి చేసుకోవడం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ తన తండ్రిపై వ్యతిరేకతతో ఉన్నాడని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని వ్యాఖ్యానించారు.  సుశాంత్ కేసులో బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పటి నుంచి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య వెనుక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, ఆ రాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఆయన పేరు ప్రస్తావించకుండా బేబీ పెంగ్విన్ అని సంబోధించింది. దీంతో అప్పటినుంచి చాలామంది నెటిజన్లు ఆదిత్య ఠాక్రే మీద సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో శివసేన నేతలు అలాంటి పుకార్లకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు. ఇదివరకే ఆదిత్య ఠాక్రే, తనకు సుశాంత్ ఆత్మహత్యతో ఎలంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. 

ఈ క్రమంలో ఎంపీ సంజయ్ రౌత్ సుశాంత్ ఆత్మహత్యపై పలు ఆరోపణలు చేస్తున్నారు. సుశాాంత్ తన తండ్రిని ఎన్నిసార్లు కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. సుశాంత్ చనిపోయిన 40 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు బయటికి వచ్చారని, సుశాంత్ ముంబయిలో చనిపోతే పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై  సుశాంత్ సోదరుడు నీరజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ రౌత్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని స్పష్టంచేశారు. దీనిపై రౌత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఇదిలావుండగా రౌత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఖండించారు. సుశాంత్ వ్యవహారంలో రౌత్ చేస్తున్న వ్యాఖ్యలు చవకబారుతనంగా ఉన్నాయని తెలిపారు. ఇది ఎంతో సున్నితమైన అంశం అని, దీనిపై శివసేన స్పందిస్తున్న తీరు హేయంగా ఉందని అన్నారు.