‘జబర్దస్త్’ను అందుకే వదిలేశా : అప్పారావు - MicTv.in - Telugu News
mictv telugu

‘జబర్దస్త్’ను అందుకే వదిలేశా : అప్పారావు

April 14, 2022

6

కామెడీ స్కిట్స్‌తో జనాల్లో ఎంతో పాపులర్ అయిన జబర్దస్త్ షో ఇటీవలి కాలం నుంచి తన ప్రాధాన్యాన్ని క్రమంగా కోల్పోతూ వస్తుంది. మొదట్లో ఉన్న నటులు తర్వాత వివిధ కారణాలతో వేరే దారి చూసుకోవడంతో షో కళ తప్పింది. కొత్తగా వచ్చిన వారు బాగానే ప్రయత్నిస్తున్నా, మునుపటి స్థాయిని మాత్రం అందుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఆ షోతో పాపులర్ అయిన కమెడియన్ అప్పారావు స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ, తనకు షోలో ఎదురైన పరిణామాలను ఏకరువు పెట్టారు. ‘జబర్దస్త్ షోలో నేను ఏడెనిమిది సంవత్సరాలు పనిచేశాను. షూటింగు ఉన్నప్పుడు ఎప్పుడూ సెలవు పెట్టింది లేదు. కానీ, కరోనా రెండో వేవ్ తర్వాత నన్ను కొంతకాలం వెయిట్ చేయమన్నారు. వేచి చూశా. నన్ను పిలవలేదు. ఎవరో ఏదో చెప్పారని నన్ను హోల్డ్‌లో పెట్టారంట. ఒకప్పుడు టీం లీడర్‌గా పనిచేసిన నాకు తర్వాతర్వాత ఒక కంటెస్టెంటుకు ఇచ్చే గౌరవాన్ని కూడా ఇవ్వలేదు. సీనియర్ నటుడినైనప్పటికీ అవమానించారు. దాంతో మనసు చంపుకోలేక తప్పుకున్నాను. చివరి క్షణంలో కూడా ఎందుకు వెళ్లిపోతున్నారని ఒక్కరు కూడా అడగలేదు. ఏదేమైనా ఇప్పుడు స్టార్ కామెడీ ప్రోగ్రాం చేస్తున్నాను. జబర్దస్త్ కంటే డబుల్ పేమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నాకు సంతృప్తిగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.