స్థూలకాయులకు గొప్ప శుభవార్త.. బరువును భారీగా తగ్గించే మందు - MicTv.in - Telugu News
mictv telugu

స్థూలకాయులకు గొప్ప శుభవార్త.. బరువును భారీగా తగ్గించే మందు

February 12, 2021

Appetite drug to control Obesity.

స్థూలకాయులకు శాస్త్రవేత్తలు గొప్ప శుభవార్త చెప్పారు. డైటింగ్, ఎక్సర్ సైజులు చేస్తున్నా బరువు తగ్గడం లేదని వాపోతున్న వారికి ఇది వరప్రసాదమే. ఇప్పటికే వాడుతున్న ఓ మందును ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వడం వల్ల అధిక బరువును సులువుగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు.

డైటింగ్, వ్యాయామం వంటివి పాటించకుండానే ఈ మందుతో బరువు తగ్గొచ్చు. కష్టపడకుండానే ఫలితం సాధించొచ్చు. బరువు తగ్గడానికి చేస్తున్న బేరియాట్రిక్ వంటి సర్జరీల కంటే ఇది చాలా సురక్షితమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు టైప్ 2 డయాబెటిస్‌కు వాడే సెమాగ్లూటైడ్ మందుతో ప్రయోగాలు నిర్వహించారు. ఆకలిని తగ్గించడానికి వాడే ఈ మందును తీసుకున్న వారు ఏకంగా 20 శాతం బరువు తగ్గారు. 16 దేశాల్లోని 2 వేల మందిపై దీన్ని ప్రయోగించారు. వారానికి ఒక డోస్ చొప్పున 68 వారాలు ఇచ్చి ఫలితాలు నమోదు చేశారు. ఈ మందు తీసుకున్న వారు సగటున 14.9 శాతం బరువు తగ్గారు. 30 శాతం మంది ఏకంగా 20 శాతం బరువును వదిలించుకున్నారు. అయితే వేగంగా బరువు తగ్గించే ఈ మందు వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డైటింగ్, వ్యాయామాలే బరువు తగ్గడానికి సురక్షిత మార్గాలని స్పష్టం చేస్తున్నారు.