Home > Featured > కేన్సర్ బాధితులకు అండగా అప్పిరెడ్డి

కేన్సర్ బాధితులకు అండగా అప్పిరెడ్డి

Appireddy

పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ఆపన్నులకు చేయూత అందిస్తున్న ఏహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, మైక్ టీవీ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. పేగు కేన్సర్‌తో బాధపడుతున్న తండ్రీకొడుకులకు అభయహస్తం అందించారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లి గ్రామానికి చెందిన నరసింహారావు, ఆయన కుమారుడు వీరరాజు ఇద్దరూ పేగు కేన్సర్‌తో బాధపడుతున్నారు. వారు పనిచేసే స్థితిలో లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. విషయం తెలుసుకున్న అప్పిరెడ్డి ఈ రోజు వారికి ఇంటికి వెళ్లి పరామర్శించారు. చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఆయన మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.

Updated : 10 Sep 2019 9:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top