పాస్‌వర్డులు అక్కర్లేని సేఫ్ టెక్నాలజీ వచ్చేస్తోంది.. - MicTv.in - Telugu News
mictv telugu

పాస్‌వర్డులు అక్కర్లేని సేఫ్ టెక్నాలజీ వచ్చేస్తోంది..

May 7, 2022

పాస్‌వర్డ్… మెయిల్ ఓపెన్ చేయాలన్నా, సోషల్ మీడియా సైట్లలో లాగిన్ అవ్వాలన్నా.. ఈ తారక మంత్రం కంపల్సరీ. అంతేకాదు ఏదైనా ఎగ్జామ్‌కు అప్లై చేయాలన్నా.. కనీసం షాపింగ్ చేయాలన్నా ఈ పాస్‌వర్డ్ వాడాల్సిందే. ఇలా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, మొబైల్ ఫోన్లలో జరిపే ప్రతి పనికి దాదాపుగా పాస్‌వర్డ్ అవసరమే. చాలా మంది ఒక్కో దానికి ఒక్కో పాస్‌వర్డ్ పెట్టి మర్చిపోతుంటారు. అవసరమైన సమయంలో దానిని మరిచిపోవటం వల్ల లాగిన్ కాలేక పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. అయితే ఈ ఇబ్బందులకు త్వరలోనే చెక్ పడనుంది. అసలు పాస్ వర్డ్‌ అవసరం లేని ప్రపంచం రాబోతుంది. దీని కోసం దిగ్గజ కంపెనీలు ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌లు జతకట్టాయి.

స్మార్ట్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, వెబ్ బ్రౌజర్లలో పాస్‌వర్డ్ అవసరం లేకుండా సైన్-ఇన్ చేసుకునేందుకు ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్ ఎఫ్‌ఐడీఓ అలయెన్స్‌కు, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్షియానికి కట్టుబడి ఉండనుంది. ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్లపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఐఓఎస్, ఆండ్రాయిల్ మొబైల్ డివైజ్‌లు, సఫారి, క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్స్, విండోస్, మ్యాక్ ఓఎస్ డెస్క్‌టాప్‌లు వంటి పలు ప్లాట్‌ఫామ్‌లపై పాస్‌వర్డ్ అవసరం లేని అథెంటికేషన్‌ను త్వరలోనే తీసుకొస్తామని ఈ కంపెనీలు తెలిపాయి.ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్లపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.