యాపిల్ ఈవెంట్ నేడే.. కొత్త ఐఫోన్లు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

యాపిల్ ఈవెంట్ నేడే.. కొత్త ఐఫోన్లు విడుదల

September 10, 2019

Apple iPhone 11 Pro ......

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి కొత్త ప్రొడక్ట్స్‌‌ను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆపిల్ ప్రొడక్ట్స్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆపిల్ వార్షిక ఈవెంట్ ఈరోజు జరుగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు యాపిల్ స్పెషల్ ఈవెంట్ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో ఉన్న యాపిల్ క్యాంపస్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జరగనుంది. 

ఈ ఈవెంట్‌లో యాపిల్ కొత్త ఐఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 5, ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లను విడుదల చేస్తుందని సమాచారం. యాపిల్ తన ఈవెంట్‌లో ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లను విడుదల చేస్తుందని సమాచారం. వీటిల్లో యాపిల్ ఎ13 బయానిక్ ప్రాసెసర్, యాపిల్ పెన్సిల్‌కు సపోర్ట్, మల్టీ యాంగిల్ ఫేస్ ఐడీ సెన్సార్, ఓలెడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ తదితర కొత్త ఫీచర్లను అందివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను యాపిల్ వెబ్‌సైట్‌తోపాటు యూట్యూబ్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా చూడవచ్చు.