ఐఫోన్లు వాడేవాళ్లంతా మంచోళ్లేనట.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐఫోన్లు వాడేవాళ్లంతా మంచోళ్లేనట..

February 27, 2020

Apple

భారతీయ సినిమాల్లో విలన్లను గుర్తించడం చాలా సులభం. కానీ, హాలీవుడ్‌ సినిమాల్లో అంత సులభంగా కనుక్కోలేం. హాలీవుడ్ డ్రామా సినిమాల్లో విలన్లు సున్నితంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే హాలీవుడ్ సినిమాల్లోని పాత్రలు వినియోగించే ఫోన్ లను బట్టి వాళ్ళు మంచివాళ్ళలేదా చెడ్డవాళ్ల అనేది చెప్పవచ్చు. ఈ విషయాన్ని హాలీవుడ్‌ దర్శకుడు రియాన్‌ జాన్సన్‌ తెలిపారు. హాలీవుడ్‌ చిత్రాల్లో ఐఫోన్లు వాడిన క్యారెక్టర్లంతా మంచివారేనని రియాన్‌ అన్నారు. 

సినిమాల్లో మంచి క్యారెక్టర్లు మాత్రమే తమ ప్రొడక్ట్స్ ఉపయోగించాలని, చెడు పాత్రలు తమ ఉత్పత్తులను వినియోగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకోమని ఆపిల్‌ కంపెనీ యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమే జారీచేసింది రియాన్ తెలిపారు. టీవీ సీరియళ్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆపిల్‌ కంపెనీ యాజమాన్యం పేర్కొంది.