చైనాకు యాపిల్ భారీ షాక్.. 4,500 మొబైల్ గేమ్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు యాపిల్ భారీ షాక్.. 4,500 మొబైల్ గేమ్స్..

July 5, 2020

Apple

భారత్ చైనా సరిహద్దు వివాదం, గాల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘటనతో భారత్ చైనాపై కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 59 చైనా యాప్స్‌‌ను భారత్‌లో నిషేధించగా.. ఇప్పుడు అమెరికా కూడా చైనాకు మరో భారీ షాక్ ఇచ్చింది. దిగ్గజ ముబైల్ సంస్థ యాపిల్ చైనీస్ యాప్ స్టోర్‌లోని 4,500 ముబైల్ గేమ్స్‌ను తొలగించింది. దీంతో చైనా కంపెనీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యాపిల్ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో చైనాకు చాలా నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ఈ విషయమై యాపిల్ సంస్థ స్పందిస్తూ.. ‘గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా గేమ్స్ తొలగించాం. చట్టపరమైన అనుమతి లేకుండా చాలా గేమ్స్ యాప్‌లో ఉంచుతున్నారు. అందుకు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. గత ఏడాది నుంచి ఈ నిర్ణయాన్ని ప్రకటించాం. ఉన్నపలంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది’ అని స్పష్టంచేసింది. లైసెన్స్‌ నిబంధనలను తిరిగి పునరుద్ధించిన అనంతరం చట్ట ప్రకారం గేమ్స్ అప్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.