ప్రపంచ షేర్ మార్కెట్ చరిత్రలో రికార్డులు సృష్టిస్తూ, కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన యాపిల్ సంస్థ భారత్‌లోకి మరో సరికొత్త ఆఫర్‌ను తీసుకొస్తోంది. ఇకనుంచి తమ కంపెనీకి చెందిన ఐఫోన్లు రిపేర్‌కు వస్తే, ఇంట్లోనే కుర్చొని రిపేర్ చేసుకోనేలా యూజర్ల కోసం ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు ప్రకటించింది ‘సెల్ఫ్ సర్వీస్ రిపేర్’అనే పేరుతో యూజర్లకు కంపెనీ మాన్యువల్, విడి భాగాల సరఫరాతోపాటు, టూల్స్‌ను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. వీటి సాయంతో యూజర్లు తమ ఇంటి నుంచే మాన్యువల్ చూసి రిపేర్ చేసుకోవచ్చని వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలిపింది. ”యాపిల్ 200కు పైగా విడిభాగాలను సెల్ఫ్ సర్వీస్ కోసం సరఫరా చేస్తుంది. ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఈ 3 మోడళ్లకు సంబంధించి స్క్రీన్, బ్యాటరీ, కెమెరాలో సమస్యలను సరిచేసుకోవచ్చు. అంతేకాదు మ్యాక్ కంప్యూటర్లకు సైతం మ్యానువల్స్, విడిభాగాలు, టూల్స్‌ను కూడా త్వరలో సరఫరా చేయనున్నాం. యూజర్లు ముందుగా support.apple.com/self-service-repair పోర్టల్ కు వెళ్లి, తాము రిపేర్ చేయదలుచుకున్న ఉత్పత్తి మ్యానువల్‌ను చదవాలి.యాపిల్ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ స్టోర్‌కు వెళ్లి, ఆర్డర్ చేయాలని అప్పుడు రిపేర్‌కు అవసరమైన విడిభాగాలు, టూల్స్‌ను గూగుల్ సరఫరా చేస్తుంది. ఇందుకు కంపెనీ సూచించిన ప్రకారం డబ్బులు చెల్లించాలి” అని యాపిల్ సంస్థ తెలిపింది.
మరోపక్క ఈ సర్వీసు ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఉంది. అయితే, ఇటీవలే దీన్ని వివిధ దేశాలకు విస్తరించాలని యాపిల్ నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్‌లో కూడా మరో ఏడాదిలోపు యాపిల్ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ మొదలవుతుందని సంస్థ అధికారులు ప్రకటించారు.