నిరుద్యోగులకు ఇది శుభవార్త. ఇండియన్ నేవీలో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే భారీగా ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ స్పెషల్ ఓరియంటేషన్ కోర్సు జూన్ 2023 కింద…టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన మహిళలు, పురుషుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ నేవీ.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితోపాటు ఇంటర్మీడియట్లో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటుగా సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ లేదా బీసీఏ లేదా కంప్యూటర్ సైన్స్, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ లేదా ఎంసీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. కాగా దరఖాస్తుదారులు తప్పనిసరిగా జూలై 1, 1998 నుంచి జనవరి 1, 2004 మధ్య కాలంలో జన్మించి ఉండాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 5, 2023వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూ నిర్వహించిన అనంతరం తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కేరళలోని ఎజిమళలో ఉన్న ఇండియన్ నేవీ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. మరింత సమాచారం ఇండియన్ నేవి అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.
https://www.joinindiannavy.gov.in/