BOI Recruitment 2023: అభ్యర్థులు అలర్ట్, బ్యాంకు ఆఫ్ ఇండియాలో అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు నేటితో ముగియనున్న దరఖాస్తులు. - MicTv.in - Telugu News
mictv telugu

BOI Recruitment 2023: అభ్యర్థులు అలర్ట్, బ్యాంకు ఆఫ్ ఇండియాలో అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు నేటితో ముగియనున్న దరఖాస్తులు.

March 14, 2023

బ్యాంకు ఉద్యోగాలకు కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా. ఈ బ్యాంకు ద్వారా అక్విజిషన్ ఆఫీసర్ల కోసం కొనసాగుతున్న దరఖాస్తు ఇవాళ్టితో ముగియనుంది. అనుకోని కారణాల వల్ల ఇంకా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన ఆసక్తి గల అభ్యర్థులు, ఇవాళ వీలైనంత త్వరగా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofindia.in ని చెక్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 500 అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. సబ్జెక్టుకు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చేక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు కింద ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ నుండి దరఖాస్తు చేసుకోండి.

డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే GEN/OBC/EWS కేటగిరీ అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, SC / ST / PWD / మహిళలు 100 రూపాయల దరఖాస్తుకు ఫీజును చెల్లించాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 28ఏళ్లు నిండి ఉండాలి.