74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, దేశభక్తితో నిండిన ఈ వాతావరణంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఆర్ఓ, సిబిఐసి, సిబిఎన్ నుండి అనేక రాష్ట్ర పోలీసు విభాగాల వరకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పదవ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా ఆన్ లైన్ ద్వారానే ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన కెరీర్ తోపాటు దేశానికి సేవ చేసే అవకాశాన్ని పొందవచ్చు.
IB రిక్రూట్మెంట్ 2023:
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ విభాగంలో సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మొత్తం 1675 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జనవరి 28 నుండి ప్రారంభమవుతుంది. పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ , దరఖాస్తు కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
AOC రిక్రూట్మెంట్ 2023:
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) ట్రేడ్స్‌మన్ మేట్,ఫైర్‌మెన్ మొత్తం 1673 పోస్టుల భర్తీకి సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది. 28 జనవరి 2023న ప్రారంభమయ్యే దరఖాస్తు ప్రక్రియతో వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్, aocrecruitment.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్మీ రిక్రూట్మెంట్ 2023:
ఆర్మీ జబల్పూర్ (మధ్యప్రదేశ్) రెజిమెంటల్ సెంటర్, హెడ్‌క్వార్టర్స్‌లో గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులలో కుక్, బార్బర్, టైలర్, డ్రాట్స్‌మన్, మెసెంజర్, దఫ్తారీ, సఫాయివాలా ఉన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సైన్యం జారీ చేసిన ప్రకటనలో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్ ద్వారా ఫిబ్రవరి 11 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా వివరాలకోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
CRPF రిక్రూట్మెంట్ 2023:
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 1458 అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీని జనవరి 31 వరకు పొడిగించింది. ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అధికారిక వెబ్సైట్ crpf.gov.in ద్వారా ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
CISF రిక్రూట్మెంట్ 2022:
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో మొత్తం 451 కానిస్టేబుల్/డ్రైవర్, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్ (డ్రైవర్ ఫర్ ఫైర్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 నుండి ప్రారంభమైంది. చివరి తేదీ 22 ఫిబ్రవరి 2023. మెట్రిక్యులేషన్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BRO రిక్రూట్మెంట్ 2023:
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో వెహికల్ మెకానిక్, ఆపరేటర్ కమ్యూనికేషన్ సహా మొత్తం 451 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ bro.gov.inలో ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అస్సాం పోలీస్ రిక్రూట్మెంట్ 2023:
అస్సాంలో, AFPF కానిస్టేబుల్, డ్రైవర్ కానిస్టేబుల్, డ్రైవర్, ఫారెస్టర్ గ్రేడ్ 1 ,ఫారెస్ట్ గార్డ్ మొత్తం 2649 పోస్టుల భర్తీకి జనవరి 23 నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ slprbassam.inలో ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.