అత్యున్నత పదవిలో శ్రీశ్రీ కుమార్తె - MicTv.in - Telugu News
mictv telugu

అత్యున్నత పదవిలో శ్రీశ్రీ కుమార్తె

March 25, 2022

 

b

విప్లవ కవి, ప్రఖ్యాత రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) చిన్న కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయవాదుల కోటాలో ఆమెకు ఈ స్థానం దక్కింది. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శి రాజేందర్ కశ్యప్ గురువారం సర్క్యులర్ జారీ చేశారు. కాగా, మాలా మద్రాస్ లా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. తర్వాత 1989లో బార్ అసోసియేషన్లో సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. గత 32 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో న్యాయవాద ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండేళ్ల నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ ప్లీడరుగా సేవలందిస్తున్నారు. ఈమె భర్త రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెద్ద కుమారుడు హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు.