ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో సలహాదారుడిని నియమించింది. దేవాదాయ శాఖకు సలహాదారుగా అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్‌ను నియమించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీ కాలంతో నెలకు లక్షన్నర రూపాయల వేతనంతో ఆయన పనిచేయనున్నారు. ఇందుకోసం రూ. 5 లక్షలు వార్షికాదాయం ఉన్న దేవాలయాల నుంచి రాబట్టే సొమ్ము నుంచి శ్రీకాంత్‌కు జీతభత్యాలు చెల్లించనున్నారు. ఉత్తర్వుల్లో మాత్రం 2018లో జారీ చేసిన జీవో నెంబరు 80 ప్రకారం జీతాలు, అలవెన్సులు చెల్లిస్తామని పేర్కొన్నారు. శ్రీకాంత్ ప్రస్తుతం ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనంతపురం నగరపాలక సంస్థ పరిధి సమన్వయ కర్తగా కొంతకాలం పనిచేశారు.