బంగ్లాదేశ్‌పై రెండో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో టీం ఇండియా గెలుపొందింది. ఓటమి వైపు పయనించిన జట్టును అశ్విన్(42*), శ్రేయస్ అయ్యర్(29*) జోడి ఆదుకుంది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 74కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఒడ్డుకు చేర్చారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్ కు 71 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ గెలిపించారు. ఇక వీరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ ఆటగాళ్ళ నుంచి అభిమానుల వరకు సోషల్ మీడియా వేదికగా అయ్యర్-అశ్విన్ ఆటను మెచ్చుకుంటున్నారు.
* “సైంటిస్ట్(అశ్విన్) పూర్తి చేశాడు. అశ్విన్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్. శ్రేయస్ అయ్యర్ తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు” అని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు.
* “అశ్విన్, అయ్యర్ అద్భుతమైన ఆట తీరుతో టీం ఇండియాకు విక్టరీ అందించారు. సిరీస్ గెల్చుకున్నందుకు అభినందనలు. బంగ్లాదేశ్ స్పిన్నర్లు భారత్ పై ఒత్తడి తెచ్చిన చివరి వరకు నిలిచి సాధించారు ” అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పొగడ్తలు కురిపించారు.
* “తీవ్రమైన ఒత్తిడిలో అశ్విన్, అయ్యర్ జోడి అదరగొట్టింది. మంచి క్లాస్ ఆట. వెల్డన్ టీంఇండియా. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీ ఫైనల్ వైపు మరో అడుగు ముందుకు ” అంటూ దినేష్ కార్తీక్ పోస్ట్ చేశాడు.
Outstanding batting under pressure by @ashwinravi99 and @ShreyasIyer15.
Pure class. Well done Team India! 🇮🇳
Need to have more of such hard fought games to keep this format ticking.One step closer to the World Test Championship finals!#BANvIND pic.twitter.com/mJhoKVQNRQ
— DK (@DineshKarthik) December 25, 2022
* శ్రేయస్, అశ్విన్‌లకు అభినందనలు. అత్యంత కీలకమైన విజయ భాగస్వామ్యం వారిది. 145 స్వల లక్ష్యాన్ని నిర్దేశించినా..350+ అన్నట్లు వారు పోరాడారు. అయితే బంగ్లాదేశ్ ఆటగాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే” అని మునాఫ్ పటేల్ ట్వీట్ చేశాడు.
Crucial match winning partnership between @ShreyasIyer15
& @ashwinravi99 congratulations #TeamIndia
But credit goes to @BCBtigers as they gave tough fight, made 145 target like 350+ #INDvsBangladesh#WTC2023 #Cricket #TestCricket#INDvBAN pic.twitter.com/rTS1Fxdb3d— Munaf Patel (@munafpa99881129) December 25, 2022