APPSC has extended the deadline for Group 1 applications
mictv telugu

అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పెంపు

November 2, 2022

ఏపీలోని గ్రూప్ 1 అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తు గడువును పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం చైర్మెన్ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు. ఇది వరకు ఉన్న ప్రకారం దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 2వ తేదీ కాగా, ఇప్పుడు దానిని పొడిగించి నవంబర్ 5కి మార్చారు. నవంబర్ 4వ తేదీ అర్ధరాత్రి లోపు ఫీజు చెల్లించాలని, ఈ పొడగింపును గమనించి అర్హులు వినియోగించుకోవాలని సూచించారు. డిసెంబర్ 18న స్క్రీనింగ్ టెస్ట్, 2023 మార్చిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సవాంగ్ తెలిపారు.