APPSC Postponed Group 1 Exam
mictv telugu

బ్రేకింగ్.. గ్రూప్ 1 పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే

November 11, 2022

APPSC Postponed Group 1 Exam

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 18న జరగాల్సిన ఈ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహిస్తామని వెల్లడించింది.

ఈ మేరకు అధికారికంగా తెలుపగా సంస్థ వెబ్ సైటులో ఈ వివరాలను ప్రచురించింది. కాగా, ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను ఏపీపీఎస్పీ భర్తీ చేస్తోంది. ఇందుకు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించగా, దానికి మరో మూడు రోజులు పెంచి నవంబర్ 5 వరకు అభ్యర్ధులకు అవకాశమిచ్చింది. అయితే పరీక్ష వాయిదాకి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు.