స్పోర్ట్స్ బైక్ కాదు స్కూటరే..అదరగొడుతున్న కొత్త మోడల్ - MicTv.in - Telugu News
mictv telugu

స్పోర్ట్స్ బైక్ కాదు స్కూటరే..అదరగొడుతున్న కొత్త మోడల్

February 6, 2020

hfb vnh b

ఇప్పటి వరకూ ఉన్న స్కూటర్ లుక్ తీరును పూర్తిగా మార్చేస్తూ స్పోర్ట్స్ మోడల్‌ లుక్‌తో సరికొత్త బైక్ రాబోతోంది. ఏప్రిలియా నుంచి ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్‌ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. స్పోర్ట్స్ బైక్ లుక్‌తో దీన్ని డిజైన్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో దీన్ని ప్రదర్శించారు. ఈ మోడల్ చూసిన వారంతా స్కూటర్ లుక్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. దీంతో వాహనదారులు సరికొత్త అనుభూతిని ఈ స్కూటర్ ద్వారా పొందే అవకాశం ఉందని అంటున్నారు. 

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ఈ ఏడాది ఆగస్టు నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది.  నీలం, ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ఎల్ఈడీ హెడ్ లైట్లు,పొడవైన విండ్ స్క్రీన్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, స్ట్రెట్చడ్ ఔట్ ఫ్లోర్ బోర్డు, రిలాక్స్ డ్ రైడింగ్ పోష్చర్ ఫీచర్స్ దీంట్లో చేర్చారు. దీంతో ముందు భాగం పూర్తిగా స్పోర్ట్స్ బైక్ లుక్ తీసుకువస్తుంది. దీంతో పాటు వ్యక్తిగత వస్తువులు దాచుకునేందుకు ముందుభాగంలో ఎక్స్ ట్రా స్టోరేజి,మొబైల్ ఛార్జింగ్ పోర్ట్  ఏర్పాటు చేశారు. చూడాలి మరి ఈ సరికొత్త స్కూటర్ వాహనప్రియులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో.