APS RTC introducing new non AC sleeper buses
mictv telugu

ఆర్టీసీలో కొత్తగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

November 22, 2022

ఏపీఎస్ ఆర్టీసీ కొత్తగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టింది. ఏసీ అంటే పడని వారికోసం ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. స్టార్ లైనర్ అనే పేరు పెట్టిన ఈ బస్సుల్లో 30 బెర్తులు 2 + 1 స్లీపర్ కోచ్ తరహాలో ఉంటాయి. రీడింగ్ ల్యాంప్స్, సీసీటీవీ, ఆడియో, ఛార్జింగ్ పోర్ట్స్, ఫైర్ సేఫ్టీ అలారమ్, ప్రతీ బెర్తుకు లగేజ్ ర్యాక్ వంటి సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 62 సర్వీసులను నడిపేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఏ ఏ రూట్లలో నడపాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. దూర ప్రాంత ప్రయాణానికి ఈ బస్సులు ఎంతో సౌకర్యంగా ఉండనున్నాయి. టిక్కెట్ ధరలు ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయిస్తామని చెప్తున్నారు. అంతేకాక, బస్సులకు మరింత ఆదరణ తీసుకువచ్చేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆదరణ పెరిగితే బస్సుల సంఖ్యను పెంచుతామని స్పష్టం చేస్తున్నారు.