APSBCL Given Permission To Another 10 Liquor Brands
mictv telugu

మందుబాబులకు గుడ్ న్యూస్..మరో 10 కొత్త బ్రాండ్లు..

November 16, 2022

మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 10 కొత్త బ్రాండ్లు ఏపీలోకి రానున్నాయి. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లకు ఏపీఎస్‌బీసీఎల్ అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న మధ్యం ధర కంటే కొత్తగా వచ్చే మధ్యం ధర ఎక్కువగా అమ్ముకునేందుకు సైతం ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని కేటగిరీల బీరు ధర రూ. 200గా ఉంది. ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల బీరు ధర రూ. 220గా ఉంది. అలాగే, కొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ. 110గా ఉంటే, ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం క్వార్టర్ ధర రూ. 130గా ఉంది. కాగా కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలలో విస్తృత మార్పులు చేసింది. ఏటా నిర్వహించే మద్యం షాపుల వేలాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా షాపుల్లో సిబ్బందిని నియమించి మరీ అమ్మకాలు సాగిస్తోంది. మరోవైపు కొత్తబ్రాండ్లు తెచ్చి భారీగా మద్యం రేట్లను పెంచిందన్న ఆరోపణలను మూటగట్టుకుంది.అయితే మధ్యపానాన్ని నిషేధించేందుకే రేట్లను పెంచినట్లు ఏపీ సర్కార్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా మరికొన్ని కొత్త బ్రాండ్లును తెచ్చి మందుబాబులకు శుభవార్త అందించింది.