హైదరాబాద్ టూ ఏపీ..ఆర్టీసీ బస్సు సర్వీసులు వాయిదా.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ టూ ఏపీ..ఆర్టీసీ బస్సు సర్వీసులు వాయిదా..

May 15, 2020

Apsrtc

లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ లో చిక్కుకున్న ఏపీ ప్రజలు తిరిగి స్వరాష్ట్రానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీ ప్రజలు తీసుకెళ్లడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతీ జిల్లా నుంచి బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆ బస్సు సర్వీసులు రేపటినుంచి అందుబాటులోకి రావాల్సిఉంది. 

కానీ, తాజా సమాచారం ప్రకారం ఆ బస్సు సర్వీసులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయని తెలుస్తోంది. సాంకేతిక కారణాలతో ఏపీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయానికి తాత్కాలికంగా వాయిదా వేసింది. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లడానికి మొదట 13 వేల మందికి అనుమతి ఇచ్చారు. దానికి అనుగుణంగా బస్సుల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. త్వరలోనే సర్వీసులు ఎప్పటినుంచి నడిపే విషయంపై ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇవ్వనుంది.