ఏపీ ఆర్టీసీ బాదుడు రేపటి నుంచే.. వడ్డింపు ఇలా..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ఆర్టీసీ బాదుడు రేపటి నుంచే.. వడ్డింపు ఇలా.. 

December 10, 2019

Apsrtc charges hike implemented from tomorrow 

తెలంగాణ ఆర్టీసీ బాటలో ఏపీ ఆర్టీసీ పెంచిన చార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఉదయం నుంచి పెంపు ఉంటుందని యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెరిగింది. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో 20 పైసలు పెంచారు. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో మాత్రం కిలోమీటరుకు 10 పైసలు మాత్రమే పెంచారు. వెన్నెల స్లీపర్ బస్సులకు చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి కొంత ఊరట కల్పించారు. 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు ఉండదు. పల్లెవెలుగు బస్సుల్లో మొదటి 2 స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు ప్రస్తుత చార్జీలనే వసూలు చేస్తారు. తర్వాత 75 కిలోమీటర్ల వరకు రూ.5 పెరుగుతుంది. s

ఇంధన ధరల్లో పెరుగుదల, సంస్థ ఆర్థిక స్వావలంబన కోసం ధరలు పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు. గత ‘నాలుగేళ్లలో డీజిల్ దర రూ.49 నుంచి రూ.70కి చేరింది. దీనివల్ల ఏటా రూ.630 కోట్ల నష్టం వస్తోంది. బస్సుల విడిభాగాలు, ఉద్యోగుల జీతాలు, అలవెన్సుల వల్ల ఇంకో రూ.650 కోట్ల మేర భారం పడుతోంది.. ’ అని యాజమాన్యం తెలిపింది.