ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ డీజిల్ సెస్ పేరిట టిక్కెట్ రేట్ల పెంపుకు రంగం సిద్దం చేసింది. జులై 1 నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అయితే పెంపు నుంచి సిటీ బస్సులను మినహాయింపునిచ్చారు. ఇప్పటికే తెలంగాణలో రేట్లు పెంచగా, ఏపీలో పెంచడానికి ఆలస్యమైంది. అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందాల ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సులలో ఒకే విధమైన రేట్లు ఉండాలి. ఈ మేరకు రేట్లు పెంచిన తెలంగాణ ఆర్టీసీ.. మీరు కూడా పెంచండంటూ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక పెంపు ప్రకారం.. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు ఎలాంటి పెంపు లేదు. 30 నుంచి 60 వరకు రూ. 5, 60 నుంచి 70 ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30 కిలోమీటర్లు దాటితే రూ.5, 66 నుంచి 80కి రూ. 10, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టిక్కెట్టుపై రూ. 10 పెంచారు. విజయవాడ – హైదరాబాదు సూపర్ లగ్జరీ బస్సులో రూ. 70, అమరావతి – హైదరాబాదు బస్సులో రూ. 80 చొప్పున డీజిల్ సెస్ విధించారు.