పిన్ నంబర్ చెబితే చాలు.. APSRTC కొత్త ప్రయోగం - MicTv.in - Telugu News
mictv telugu

పిన్ నంబర్ చెబితే చాలు.. APSRTC కొత్త ప్రయోగం

June 30, 2020

nkjfk

కరోనా తర్వాత డిజిటల్ వాడకాలకు ఆధరణ పెరిగింది. చాలా వరకు మొబైల్ యాప్‌ల ద్వారా పనులు పూర్తి చేస్తున్నారు. నగదు చెల్లింపులు, కొనుగోళ్లు అన్ని ఇలాగే జరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి బస్సు ప్రయాణాలు చేసే వారు టికెట్ తీసుకోవడానికి బదులు ముందుగా పిన్ నంబర్ చెబితే సరిపోతుంది. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకొని పిన్ నంబర్ పొంది.. దాన్ని చెప్పి ప్రయాణం చేయవచ్చు. దీంతో ప్రయాణం మరింత సులభతరం అవుతుందని అంటున్నారు.  

‘ప్రథమ్’ పేరుతో కొత్త యాప్‌ను సిద్ధం చేశారు. పల్లె వెలుగుసహా అన్ని బస్సులకూ దీన్ని వాడనున్నారు. వచ్చే నెల నుంచి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు. చాలా సులువుగా ప్రయాణికుడు దీన్ని వాడుకోవచ్చు. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది యాప్‌లో నమోదు చేయాలి. ఆ వెంటనే ఏ బస్సు, ఏ సమయంలో అందుబాటులో ఉందో లిస్టు వస్తుంది. దాంట్లో ఏదో ఒకదానిని ఎంచుకొని టికెట్ బుక్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వెంటనే టికెట్‌ తో పాటు 4 అంకెల పిన్‌ నంబరు వస్తుంది. బస్సు ఎక్కే సమయంలో ఆ పిన్ నంబర్ చెబితే వాటిని సరి చూసుకొని డ్రైవర్ ప్రయాణానికి అనుతి ఇస్తాడు. దీంతో నగదు చేతులతో ముట్టుకునే పని లేకుండా పోతుందని అంటున్నారు.