నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మరో శుభవార్త చెప్పింది. ఇటీవల వరుసగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్న సంస్థ తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ అరబిందో ఫార్మా కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. మొత్తం 475 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
• మొత్తం 475 ఉద్యోగాల్లో డిపార్ట్మెంట్ క్యూసీ, ప్రొడక్షన్, ప్యాకింగ్, మెయింటెనెన్స్ విభాగాలు ఉన్నాయి.
• ఎంఎస్సీ/బీఎస్సీ/ఎంఫార్మసీ/బీఫార్మసీ/డిప్లొమా స్టూడెండ్స్/ఇంటర్ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
• 2018-22 వరకు పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
• అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
• రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
• టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
• ఎంపికైన అభ్యర్థులు ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది.
• అభ్యర్థులు ఇతర వివరాలకు 8639015530, 6301006979 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.