ఉన్నతపదవుల్లో ఉన్న వారి ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి. నోరు జారితే ఊరు ఉరుముతుంది. కోర్టులు జైళ్లకు పంపిస్తాయి. టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) చైర్మన్ వర్ల రామయ్య ఓ దళిత యువకుడిపై జులుం ప్రదర్శించి, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రామయ్య గురువారం మచిలీపట్నం బస్టాండ్లో అధికారులతో కలసి బస్సులను తనఖీ చేశారు. ఓ బస్సులోని యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఉండడంతో రామయ్య అహం దెబ్బతింది. నిప్పులు తొక్కిన కోతిలా చెలరేగిపోయాడు. ‘నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవా? నీ కులం ఏంటో చెప్పు? మాల లేదా మాదిగా?. మాదిగలు అసలు చదవరు. ఈ వెధవ పరీక్ష కూడా రాసి ఉండడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొలం ఉందా? బ్యాంకులో ఎన్ని లక్షలు ఉన్నాయి? డబ్బులు లేకపోతే ఎలా చదువుకుంటావ్?. ఫోన్లు గీన్లు మానేసి చదువుకో.. నాకొడుకు.. ’అంటూ ఘోరంగా అవమానించాడు.
దీంతో సదరు ప్రయాణికుడు సహా చుట్టుపక్కల వారు షాక్ తిన్నారు. ఉన్నతపదవిలో ఉన్న వ్యక్తి ఇలా కులదూషణకు దిగడమేంటని సణుక్కున్నారు. ఆర్టీసీ సిబ్బంది ఒకపక్క ప్రయాణికులతో మర్యాదగా ఉండాలని మర్యాద వారోత్సవాలు నిర్వహిస్తోంటే చైర్మన్ ఇలా కించపరచడమేంటని విపక్షాలు మండిపడుతున్నాయి.