రోజమ్మా...ఎందో సంగతి చెప్పమ్మా...? - MicTv.in - Telugu News
mictv telugu

రోజమ్మా…ఎందో సంగతి చెప్పమ్మా…?

June 23, 2017

అన్ని ధర్నాలకు ముందే వచ్చిన రోజా..విశాఖలో జగన్ ధర్నాకు ఎందుకు రాలేదు…?ఫైర్ బ్రాండ్ అలిగిందా…? అలిగితే ఎవరిపై ఎందుకు ..?సేవ్ విశాఖ ధర్నాకు ఇందుకే డుమ్మా కొట్టిందా..?జన సేన వైపు ఆమె చూపు మళ్లిందా..?ఇందులో భాగంగానే నాగబాబు రోజా బాధల్ని పవన్ దగ్గరకు తీసుకెళ్లారా..?ఇప్పుడు ఇవే ఏపీలో జోరుగా జనం చర్చించుకుంటున్న ప్రశ్నలు.

ఫైర్ బ్రాండ్ రోజా కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. తరచుగా ప్రెస్ మీట్లలో కనిపించే ఆమెకు ఏమైంది. ప్రెస్ మీట్లు అంటే టాపిక్ లేదేమో అనుకోవచ్చు. మరి వైసీపీ ధర్నాలకు ఎందుకు రాలేదు. సేవ్ విశాఖ ధర్నాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది. పార్టీ మహిళా అధ్యక్షురాలిగా మస్ట్ గా అటెండ్ కావాల్సిందే కదా..ఎందుకు వెళ్లలేదు. అంటే ఏదో మతలబు ఉంది.

వైసీపీ అధినేత జగన్.. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజాకు వార్నింగ్ ఇవ్వడంతో ఆమె మనస్థాపం చెందినట. తిరుమలలో రోజా ప్రవర్తించిన తీరుపై శివసేన నేతలు విమర్శలు చేశారు. దీంతో ఆమెను ఇంటికి పిలిపించుకుని జగన్ సీరియస్ అయినట్లు వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. జగన్ వార్నింగ్ ఇవ్వడం వల్లే రోజా మనస్థాపంతో సేవ్ విశాఖ ధర్నాకు డుమ్మా కొట్టారని మాట్లాడుకుంటున్నారు.

ఇంకేముంది సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏకంగా వైసీపీని వీడి పవన్ కల్యాన్ జనసేనలో చేరబోతున్నారని ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెట్టేస్తున్నారు. దీని కోసం ఆమె నాగబాబు ద్వారా పవన్ తో మాట్లాడినట్టు కూడా చెబుతున్నారు. అంతే కాదు రాయలసీమ నుంచే ఎంపీగా నిలబడే ఒ్పందాలు ఇప్పటినుంచే చేసుకున్నట్లు రూమర్స్. మొత్తానికి రోజా నోరు విప్పితే గానీ అస్సలు విషయం ఏంటో తెలియదు. రోజామ్మా…ఎందో సంగతి చెప్పమ్మా…