బుర్ఖాతో నా కూతురికి స్వతంత్రం వచ్చింది.. ఏఆర్ రెహ్మాన్ - MicTv.in - Telugu News
mictv telugu

 బుర్ఖాతో నా కూతురికి స్వతంత్రం వచ్చింది.. ఏఆర్ రెహ్మాన్

February 21, 2020

cfthd

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కుమార్తె బుర్ఖా ధరించడంపైస్త్రీవాద రచియిత్రి తస్లీమా నస్రీన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. ఆమెను చూస్తే ఊపిరి సలపనట్టుగా ఫీల్ అవుతానని చెప్పారు. ఒక విద్యావంతురాలైన యువతి కూడా చాలా సులువుగా బ్రెయిన్ వాష్ చేయబడుతుందని తెలిసి బాధగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇది వివాదానికి దారి తీసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ అంశంపై రెహ్మాన్ వివరణ ఇచ్చారు. 

ఇటువంటి విమర్శలపై తాను స్పందించనని చెబుతూనే చురకలంటించారు. ‘బుర్ఖా ధరించడం ద్వారా నా కూతురుకు స్వాతంత్య్రం దొరికిందని అనుకుంటున్నా. అలా ధరించడం మత పరమైన విషయం కాదు. అది ఓ మానసికమైన నిర్ణయం. కొన్నిసార్లు బయటకు వెళ్లినప్పుడు ఆమె వేలాది మంది దృష్టిలో పడుతుంది. అప్పుడు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అటువంటి వారు బుర్ఖా ధరించడం వల్ల ఓ షాపునకు వెళ్లడమో లేదా ఇతర పనులపై వెళ్లడమనేది సులువు అవవుతుంది. నా కూతురుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె నా ఇంట్లో సహాయకులుగా ఉండే వారి శుభాకార్యాలకు కూడా వెళ్తుంది. అంతటి నిరాడంబరత తనకు ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.