నా గదిలో జెర్రీ దూరింది, టామ్‌ను పంపించండి! - MicTv.in - Telugu News
mictv telugu

నా గదిలో జెర్రీ దూరింది, టామ్‌ను పంపించండి!

January 19, 2020

Tom and Jerry.

కొన్ని సినిమాల్లోని పాత్రలు, కథల్లోని సన్నివేశాలు, పాటలను ఎప్పటికీ మరిచిపోలేం. అవి ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. వాటిని పదేపదే చూస్తుంటాం. అలా తరాలు మారినా వాటి క్రేజ్ తరాలకు పాకుతుంటుంది. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు కార్టూన్స్ టామ్ అండ్ జెర్రీ గురించి మాట్లాడుకోవాలి. అందులోని పిల్లి, ఎలుక చేసే అల్లరి నచ్చని ప్రేక్షకుడు ఉంటాడా చెప్పండి. ఆ కార్యక్రమం ఇప్పుడు రాకపోయినా.. పాత ఎపిసోడ్లను యూట్యూబ్‌లో మార్చి మార్చి ఎన్నోసార్లు చూస్తుంటారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి, హాయిగా నవ్వుకోవడానికి టామ్ అండ్ జెర్రీ చూస్తామని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు. ఆఫీసుల్లో కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఆ కార్యక్రమం చూస్తుంటారు. అలా ఆ రెండు పాత్రలను విపరీతంగా అభిమానిస్తున్న ఓ వ్యక్తి చిత్రమైన పనిచేశాడు. తను ఉన్న గదిలో ఎలుక ఉందని టామ్ అండ్ జెర్రీ భాషలో చెప్పి హోటల్ యాజమాన్యాన్ని ఆశ్చర్యపరిచాడు. నా గదిలో జెర్రీ దూరింది టామ్‌ను పంపించండి అని అన్నాడు. 

అరబ్‌ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇంగ్లండ్‌లోని ఇంటర్ కాంటినెంటల్ అనే హోటల్‌లో దిగాడు. ఆ గదిలోకి ఎలుక దూరింది. ఈ విషయాన్ని హోటల్ రిసెప్షనిస్టుకు ఫోన్ చేసి చెప్పాడు. దానిని టామ్ అండ్ జెర్రీ పాత్రలతో పోల్చి చెప్పాడు. ‘నా గదిలో జెర్రీ దూరింది. వెంటనే నా గదికి ఒక టామ్‌ను పంపించండి. అప్పుడు ఆ టామ్‌ నా గదిలో ఉన్న జెర్రీని పట్టుకుంటుంది’ అని ఆ వ్యక్తి హోటల్‌ రిసెప్షనిస్ట్‌కు ఫోన్‌‌లో చెప్పాడు. అది విని సదరు రిసెప్షనిస్ట్ ఆశ్చర్యపోయింది. తర్వాత అతను మాట్లాడిన ఫన్నీ ఫోన్‌ సంభాషణను ఓ ట్విటర్‌ యూజర్‌ తన ట్విటర్‌‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ ఫోన్‌ సంభాషణ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. టామ్‌ అండ్‌ జెర్రీకి సంబంధించిన పలు మీమ్స్‌ను పంచుకుంటూ హాయిగా నవ్వుకుంటున్నారు.