ఘనంగా అరకు ఎంపీ మాధవి వివాహం - MicTv.in - Telugu News
mictv telugu

ఘనంగా అరకు ఎంపీ మాధవి వివాహం

October 18, 2019

Araku mp madhavi married childhood friend shiva prasad

కొన్ని రోజుల క్రితం అరకు ఎంపీ మాధవి ప్రివెడ్డింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు తెల్లవారుజామున ఆమె పెళ్లి ఘనంగా జరిగింది. తన బాల్యమిత్రుడు శివప్రసాద్‌ను మాధవి పెళ్లి చేసుకున్నారు.

ఆమె స్వగ్రామం శరభన్నపాలెలో పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి వైఎస్సార్‌‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు. 

ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్‌లో రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు. మాధవి భర్త శివప్రసాద్ స్వస్థలం విశాఖపట్టణం జిల్లా గొలుగొండ మండలం కెడిపేట గ్రామం. ఎంబీయే పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీని నిర్వహిస్తున్నారు. ఇక గతంలో టీచర్‌గా పనిచేసిన మాధవి ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మాధవి 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు.