Archery World Record: Most arrows through a keyhole
mictv telugu

మామూలోడు కాదు.. చిన్న బొక్కలో 9 బాణాలు..

November 6, 2022

ప్రపంచంలో టాలెంట్‌కు కొదవ లేదు. కొందరిలో ఉండే అద్భుతమైన ప్రతిభ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య వేగంగా బయట ప్రపంచానికి తెలుస్తోంది. కొన్ని వీడియోలు చాల అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా డెన్మార్క్ కు చెందిన లార్స్ అండర్సన్ విల్లువిద్యలో ఉన్న తన టాలెంట్‌తో గిన్నీస్ రికార్డు సృష్టించాడు.

కీ హోల్‌లో ‘కీ ’పెట్టేందుకే మనకు కొన్నిసార్లు కాస్త సమయం పడుతుంది. అలాంటి నుంచి కీ హోల్‌లో 30 అడుగుల దూరం నుంచి ఏకంగా బాణాలను వదిలి అబ్బురపరిచాడు. నార్మల్ విల్లును ఉపయోగించి.. ఒక సెంటీమీటర్ సైజు ఉన్న కీ హోల్ నుంచి అలవోకగా ఏడుబాణాలను వదిలాడు. వైరల్ అయిన ఈ వీడియోని చూసిన నెటిజన్లు నమ్మశక్యంగా లేదని…వాట్ ఏ టాలెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కీ హోల్ నుంచి దూరేందుకు ఈకల్లేని బాణాలను లార్స్ అండర్ సన్ ఉపయోగించాడు. గతంలో కూడా విల్లువిద్యలో ఎన్నో అద్భుతాలను లార్స్ అండర్ సన్ సృష్టించాడు.