చపాతీలు ఆర్యోగానికి మంచిదేనా..! - MicTv.in - Telugu News
mictv telugu

చపాతీలు ఆర్యోగానికి మంచిదేనా..!

March 24, 2022

gbfgcb

చపాతీలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కొంతమందిలో చపాతీలు తినటం అంటే.. అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్లు చపాతీలు తినండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పినప్పుడే తింటాము కదా మిగతా సమయంలో తినము కదా అనే అపోహ ఉంటుంది. మరికొందరిలో ఒకపూట చపాతీ తింటే సన్నబడుతాము అనే ఆలోచనతో తింటారు. చపాతీలు ఎన్ని ఎక్కువ తింటే అంత మంచిదని కొందరు. ఎక్కువగా తింటే మంచిదికాదని మరికొందరు చేప్తుంటారు. మరి ఇంతకీ చపాతీలు తింటే మంచిదేనా? కాదా? చపాతీలు తినటం వల్ల ఉపయోగాలు ఏంటీ? అనే అనుమానాలపై నిపుణులు ఏం చేప్తున్నారో ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా..

చపాతీని నిపుణులు పోషకాల సమ్మేళనంగా పిలుస్తారట. ”చపాతీలో బి. ఇ విటమిన్లతోపాటు కాపర్, జింకు, అయోడిన్, మాంగనీస్, సిలికాన్, కాల్షియం, పోటాషియం ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయట. కార్బోహైడ్రాడ్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయట. బరువు తగ్గడానికి ఇది మంచి ఆహారమట. రోజు రెండు సాధారణ సైజు చపాతీలను తింటే అందులో ఉండే అధిక పీచు.. కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఆకలి వేయకుండా ఉండి ఇతర చిరుతిండి వైపు మనసు మళ్లదు” అని నిపుణులు అంటున్నారు.

అంతేకాకుండా ఈ చపాతీలు ఇతర పదార్థాలతో పోల్చితే, కాలరీలు తక్కువ. రక్తహీనతతో బాధ పడుతున్నపుడు రోజూ చపాతీని ఆహారంలో భాగం చేసుకోవాలి. చపాతీలో ఉండే అధిక ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్దీకరిస్తాయి. జింకు, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. చర్మ సమస్యలు దరిచేరవు. ఇందులో ఉండే పీచు జీర్ణ వ్యవస్థకు మంచిది. అజీర్తి, గ్యాస్, మలబద్దకం సమస్యలున్న వారు వైద్యుల సలహాలో ఆహారంగా చపాతీలను చేసుకోవాలి” అని నిపుణులు పేర్కొన్నారు.

అంతేకాకుండా సెలినియమ్ క్యాన్సర్ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడుతుంది. అతి తక్కువ కొవ్వు ఉండటంతో గుండెకు చాలా మంచిది. మనకు జ్వరం రాగానే గుర్తుకు వచ్చేది చపాతీ. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. చపాతీ మంచిదే కదాని మీకు నచ్చినట్టు నూనె, నెయ్యి వేసుకోవడంతో అనవసర కొవ్వు చేరుతుంది. నూనె లేకుండా పుల్కా చేసుకొని తినడం మరీ మంచిది. బయట దొరికే గోధుమ పిండిలో మైదా కలుస్తుంది. ముడి గోధుమలు తీసుకొని పట్టించుకుంటే చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.