Are Ganesha and Hanuman Gods?..Adil Chisti
mictv telugu

వినాయకుడు, హనుమంతుడు దేవుళ్లేనా?..అదిల్ చిస్తీ

July 15, 2022

 

”హిందువులకు 333 కోట్లమంది దేవుళ్లు ఎలా ఉంటారు? అందులో కొంతమంది దేవతలు సగం జంతువు, సగం మనుషుల్లా ఉంటారు అదేలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే వినాయకుడు, హనుమంతుడు కూడా దేవుళ్లేనా?” అంటూ హిందూ దేవుళ్లపై అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా కార్యదర్శి సయ్యద్ సర్వర్ కుమారుడు అదిల్ చిస్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది.

అదిల్ చిస్తీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అదిల్ చిస్తీపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలపై పలు రకాల విమర్శలు వస్తుండడంతో శుక్రవారం అదిల్ చిస్తీ స్పందించాడు.’హిందువుల మనోభావాలు దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. నుపుర్ శర్మను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు అయినా గాయపడి ఉంటే నన్ను క్షమించండి’ అని ఆయన కోరారు.

అనంతరం ”నూపుర్ శర్మ హిందువు అయితే..ఆమె కోసం నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 333 బిలియన్ల దేవుళ్ళు ఉన్నారని ఎలా అంగీకరించాలి? ఇది ఎలా సమంజసం? మన మతాలు ఎలా ఉన్నా మనుషులుగా మనమంతా సమానమే. మేము భగవంతుని ఉనికిని, అత్యున్నతమైన దేవత ఉనికిని గట్టిగా నమ్ముతాము. వివిధ మతాల ప్రజలు ఒకే విషయానికి భిన్నమైన వివరణలు కలిగి ఉండవచ్చు. అయితే 333 కోట్ల దేవుళ్లను, దేవుళ్ల సంఖ్యను ఎలా నమ్మాలి? 333 కోట్ల మంది దేవతలను ఎవరూ సంతోషపెట్టలేరని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.