నయనతారకి పెళ్లైపోయిందా! వీడియోలో ఏముంది? - MicTv.in - Telugu News
mictv telugu

నయనతారకి పెళ్లైపోయిందా! వీడియోలో ఏముంది?

March 14, 2022

ngn

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లి మాత్రం సరైన సమయం వచ్చినప్పుడు చేసుకుంటామని ఇన్నాళ్లూ చెప్తూ వచ్చింది. అయితే తాజాగా బయటికొచ్చిన ఓ వీడియో చూస్తే మాత్రం వీరిద్దరికీ పెళ్లైపోయిందా? అనే అనుమానం కలిగిస్తోంది. ఈ జంట ఆదివారం చెన్నైలోని ఓ అమ్మవారి గుడికి వెళ్లారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయ సిబ్బంది కోరిక మేరకు వారితో ఫోటోలు దిగారు. దీన్ని వీడియోగా తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో నయనతార నుదుటిపై సింధూరం పెట్టకుందనీ, అంటే వీరికి పెళ్లైపోయిందని కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.