Are they the police..they beat like this..here is the video
mictv telugu

వీళ్లు పోలీసులేనా..ఇలా కొట్టుకున్నారు..వీడియో ఇదిగో

September 7, 2022

Are they the police..they beat like this..here is the video

ప్రజలు తప్పు చేస్తే, బుద్ది చెప్పాల్సిన పోలీసులే పట్టపగలే అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై చితకొట్టుకున్నారు. పోలీసులు కొట్టుకుంటున్న విధానం చూసి ‘అసలు వీళ్లు పోలీసులేనా, ఇలా కొట్టుకుంటున్నారు’ అంటూ స్థానికులు నవ్వుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకు ఆ పోలీసులు కలబడ్డారు? అనే వివరాల్లోకి వెళ్తే..

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జలాన్‌లోని జగమ్మన్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఓ హోంగార్డు, కానిస్టేబుల్‌ నడిరోడ్డుపై కలబడ్డారు. మద్యం విషయంలో జరిగిన గొడవే ఇందుకు కారణమని తెలుస్తోంది. తొలుత ఇద్దరి మధ్య ప్రారంభమైన, వాగ్వివాదం కాస్తా ముదిరి కొట్లాటకు దారి తీసింది. దీంతో చెలరేగిపోయిన కానిస్టేబుల్..హోంగార్డుపై ముష్టిఘాతాలు కురిపించాడు. కాళ్లతో తంతూ చెలరేగిపోయాడు.

దాంతో ఇద్దరూ రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో పడ్డారు. కిందపడ్డాక హోంగార్డుపై కానిస్టేబుల్ మరింతగా చెలరేగిపోయాడు. ఆగకుండా పిడిగుద్దులు కురిపించాడు. మరో కానిస్టేబుల్ వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు గంటపాటు వారిద్దరి మధ్య కోట్లాట జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై వీరిద్దరూ కొట్లాడుకుంటుంటే దారినపోయే వారు వాహనాలు ఆపి మరీ చూస్తుండిపోయారు. కొందరు ఈ ఘటనను తమ ఫోన్లలో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.