అదేంటి హెడ్డింగ్ చాలా గమ్మత్తుగా ఉందనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే, మేం రాసింది నిజమే. అవును డాక్టర్లు కన్యత్వం, బహుభార్యత్వం నిరూపించుకోవాల్సిందే, ఇది మేం అంటున్న మాట కాదు, బీహార్ రాష్ట్రం పాట్నాలో ఉన్న ఇందిరా గాంధీ ఇన్సిట్యూట్ ఆప్ మెడికల్ సైన్స్ కాలేజీవాళ్లు పెట్టిన రూల్స్, అక్కడ పనిచేసే వ్యక్తులైనా, కొత్తగా అపాయింట్ అయ్యే డాక్టర్లైనా నర్సులైనా మ్యారేటల్ డిక్లరేషన్ ఫామ్ ఖచ్చితంగా నింపాల్సిందే అంటున్నారు.
ఆ మెడికల్ కాలేజీవాళ్లు, అందులో వాళ్లు బ్యాచ్ లరా, లేక వర్జినా కాదా,పెండ్లైందా పెండ్లైతె ఒక్కలే భార్యనా లేకపోతే ఎంత మంది భార్యలు ఉన్నారు, అని ఆ కాయిదంల ఖచ్చితంగా రాయాల్సిందేనట, ఆడోళ్లు గుడ ఖచ్చితంగ రాయాల్సిందేనట. అయితే వివాదానికి దారితీసిన డిక్లరేషన్ ఫామ్ పట్ల హాస్పటల్ సూపరిండెంట్ మనీష్ మండల్ స్పందించారు. ఫామ్‌ను రూల్స్ ప్రకారమే రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగి చనిపోతే, క్లెయిమ్స్ ఎవరికి వెళ్లాలన్న ఉద్దేశంతోనే అలాంటి ప్రశ్నలు వేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం, రాజ్యాంగమే రూల్స్‌ను తయారు చేస్తాయని వాళ్లు మారిస్తే తాము మారుస్తామని ఆయన చెప్పారు. కానీ గిసొంటి రూల్స్ ఈడ తప్ప ఏడ ఉండయ్ గావచ్చు కదా.