“Are You A Virgin ??” Follower Tried To Ask Shruthi Haasan !! Check Her Savage Reply
mictv telugu

మీరు వర్జినేనా ?..శృతి హాసన్‌‌కు అభిమాని నుంచి చెత్త ప్రశ్న..ఆమె ఏం చెప్పారంటే..

March 17, 2023

sruthihasan

శ్రుతిహాసన్..కమల్‌హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కవ కాలంలోనే సొంత ఇమేజ్‌తో ఎదిగిన హీరోయిన్. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె గబ్బర్ చిత్రంతో విజయం సాధించారు. ఆ చిత్రం తర్వాత ఆమె తెలుగు యువకుల కలకల రాణిగా మారిపోయింది.అనంతరం పెద్ద హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్, రవితేజ,మహేశ్​ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల పక్కన నటించి మెప్పించింది ఈ సొట్టబుగ్గల బ్యూటీ.

ప్రస్తుతం శృతి కెరీర్ రాకెట్ స్పీడ్‌లో ముందుకు దూసుకుపోతోంది. ఆమె బడా సినిమాలతో మంచి ఫామ్‎లో ఉన్నారు. తెలుగు, తమిళం, హీందీ భాషల్లో వరుసు చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్​ను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంలో ముందుటారు. తాజాగా, సోషల్​మీడియా యాజర్స్​తో లైవ్ చాటింగ్ చేసింది.నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది. ఇంతో ఓ నెటిజన్ నుంచి చెత్త ప్రశ్నను ఎదుర్కొంది శృతిహాసన్. మీరు వర్జినేనా.. అని అడిగేశాడు. దీనిపై శృతి హాసన్ ఫైర్ అయ్యింది. ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో అంటూ కాస్త గట్టిగానే సమాధానమిచ్చింది.

మరో అభిమాని నేను మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను.. అంటూ ప్రశ్నించగా దానికి శృతి హాసన్ నో అని చెప్పింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా వరుసు సినిమాల్లో చాన్స్‎లను కొట్టేస్తోంది.