పండ్లు తినడం మంచిదని అందరికీ తెలుసు. పండ్లు గొప్ప పోషక విలువలను కలిగి ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్ తో నిండి ఉంటాయి. అయితే ఈ పండ్లను తినడానికి రోజులో నిర్దిష్ట సమయం ఉందా? పండ్లు తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కారణ కణాల నుంచి రక్షణను అందిస్తుంది. అన్ని పోషకాలను పొందుతున్న మరి ఆ పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదంటున్నారు నిపుణులు. పండ్లు తినడానికి ఉత్తమ సమయాన్ని ఎంచుకోమంటున్నారు.
మేల్కొన్న తర్వాత..
పండ్లను తినడానికి ఇది ఉత్తమ సమయం. రాత్రిపూట మీ శరీరం విశ్రాంతి తీసుకున్న తర్వాత, త్వరిత బూస్ట్ అవసరం. ఆ సమయంలో పండ్లు సులభంగా జీర్ణమవుతాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. కాబట్టి రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించడానికి శక్తి అవసరం.
భోజనానికి ముందు..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లంచ్ కి మధ్యలో చిరుతిండిని ఇష్టపడుతున్నారా? అది గొప్ప అలవాటు. ఈ సమయంలో మీ శరీరం ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. పండ్లను విచ్చిన్నం చేయడానికి నిర్దిష్ట ఎంజైమ్స్ ను స్రవిస్తుంది. భోజనానికి ముందు ఆకలిని నిరోధిస్తూ, పండ్లు మిమ్మల్ని కాసేపు నిండుగా ఉంచుతాయి. అన్నం తక్కువ తినాలి అనుకున్నప్పుడు ఒక ప్లేట్ పండ్లను, నట్స్ తింటే మంచిది.
వ్యాయామానికి ముందు..
వర్కవుట్ కు ముందు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి పని చేయడానికి అవసరమైన తక్షణ శక్తిని పొందవచ్చు. వ్యాయామానికి అవసరమైన ఆరోగ్యకరమైన పోషకాలను పండ్లు మీకు అందిస్తాయి. వర్కవుట్ తర్వాత పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలోని శక్తి నిల్వలను తిరిగి నింపడంలో సహాయపడుతుంది. పండ్లు తినడానికి చెత్త సమయం..
నిద్రపోయే ముందు..
పడుకునే ముందు పండ్లు తినకండి! నిద్రవేళకు ముందు పండ్లను తీసుకోవడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మీకు రాత్రి సరైన నిద్ర రాకుండా చేస్తుంది.
భోజనంతో పాటు..
కొందరు పెరుగుతో, కూరలతో కూడా పండ్లు తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఆ పని మానుకోండి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. మీరు పండ్లు తీసుకున్న తర్వాత కనీసం ఒకటి లేదా రెండు గంటలు వేచి ఉండాలి. అప్పుడే వాటిలోని పోషకాలు శరీరం గ్రహిస్తుంది.