సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగినప్పుడే..జీవితానికి ఓ అర్థం ఉంటుంది. గెలుపు ఓటమి రెండింటినీ సమానం ఎదుర్కొవాలి. మనం చేసే ప్రతి పనిలో సమస్య ఉంటుంది. వాటిని ఛాలెజింగ్ గా భావించాలి. అంతేకాని ఇక్కడ సమస్య ఉందని..మరో చోటికి దూకితే అది కూడా మరో సమస్యగా మారుతుంది. మీరు చేసే పని ఇష్టపడి చేయాలి. మీరు చేసే ఉద్యోగంలో సవాళ్లను ఎదుర్కొవడం నేర్చుకుంటే..మీరు పయనిస్తున్న మార్గంలో ఎలాంటి అడ్డంకి ఉండదు.
ప్రతి ఒక్కరూ ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ…మంచి జీతం పొందాలని కోరుకుంటారు. అంతేకాదు తాను పనిచేస్తున్న కంపెనీ ఉన్నత స్థానంలో ఉండాలన్న కోరిక కూడా చాలా మందికి ఉంటుంది. కానీ అనుకున్న సులభం కాదు. అసాధ్యమైనంత కష్టం కాదు. మన ఆలోచనలను మార్చుకుంటే కెరీర్ లో విజయం ఖచ్చితంగా సాధిస్తాం. కార్యాలయంలో బాస్ కింద పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు మన తప్పులేకున్నా అనవసరంగా తిట్టాల్సి వస్తుంది. తక్కువ సమయంల లక్ష్యాన్ని చేరుకోవాలంటే..రాత్రింబవళ్లూ కష్టపడాల్సి ఉంటుంది. తోటిఉద్యోగులతో స్నేహపూర్వకంగా, సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది. పనిలో గొడవలు, దూషణలు కూడా వినాల్సి వస్తుంది. కొందరి మనస్సు బాధపెట్టాల్సి వస్తుంది. మనపై పని ఒత్తిడి పెరిగితే..అది కోపానికి దారి తీస్తుంది. దీంతో అనవసరంగా అందర్నీ బాధపెట్టాల్సి వస్తుంది. ఇది ఆఫీసులో మన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది. దీని ప్రభావం పనిపై కూడా పడుతుంది. మీ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడవచ్చు. కాబట్టి ఆఫీసులో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పనిచేయడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే.
మీ పనిక్రెడిట్ వేరొకరికి దక్కినప్పుడు:
ప్రతిచోటా రాజకీయాలు ఉంటాయి.ఆఫీసులో కూడా ఇవన్నీ మామూలే. కొన్నిసార్లు మీ కష్టానికి సంబంధించిన క్రెడిట్ మరొకరికి దక్కుతుంది. నేనే చేశాననంటూ బాస్ ముందు గొప్పలు చెప్పుకుంటారు. అప్పుడు మీకు కోపం వస్తుంది. మీ ఆ వ్యక్తితో ప్రశాంతంగా మాట్లాడుతూ..నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదని చెప్పు. అరవడం సమస్యకు పరిష్కారంకాదు. వారు అంగీకరించకపోతే…ప్రాజెక్టు గురించి వారికంటే మీకు ఎక్కువ తెలుసని మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి.
ఏ విషయమైన ప్రశాంతంగా చెప్పాలి:
మీ ఆఫీసు సమయం ముగిసిపోయిన తర్వాత కూడా మీ బాస్ మీకు పని చెబుతారు. అలాంటి సమయంలో చికాకు పడకూడదు. తిరస్కరించే బదులు..ఈ పని చేయడం కుదరదంటూ ప్రశాంతంగా చెబితే ఎదుటి వ్యక్తికి మీ సమస్య అర్థమవుతుంది.
మొరటుతనం కాదు..వినయం పాటించాలి;
ఆఫీసులో అన్ని పనులు మీరే చేయడం మంచిది కాదు. కొన్నిసార్లు ఇవన్నీ నేను చేయలేనని ఓపెన్ గా చెప్పాలి. అప్పుడు మీరు మొరటుతనానికి బదులుగా వినయంగా మాట్లాడాలి.
క్షమాపణ ముఖ్యమైంది:
తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పును ఒప్పుకోవడం చాలా ముఖ్యం. మీ తప్పును కప్పిపుచ్చి…ఇతరుల తప్పును పెద్దగా చేస్తే…మరింత ప్రభావితం చేస్తుంది. మీరు చేసిన తప్పును అంగీకరించి క్షమించమని కోరితే మంచిది. ఇది మీ ఇమేజ్ డ్యామేజ్ చేయదు.