మనలో చాలామందికి వేడి వేడి కాఫీ, టీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. పొగలుకక్కే టీ, కాఫీ తాగితేనే..తాగామన్న ఫీలింగ్ ఉంటుంది. వేడి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి వేడి టీ లేదా ఇతర పానీయాలు తీసుకోవడం వల్ల అన్నవాహిక ముప్పు వాటిల్లుతుంది. వేడి పానీయాలు తాగడం లేదా వేడి ఆహారాన్ని పదే పదే తీసుకోవడం వల్ల మన గొంతు, అన్నవాహిక గాయపడే ప్రమాదం ఉంది. ఇది మంట, క్యాన్సర్ కణాలు ఏర్పాడటానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.
ఈ సమస్యలు వస్తాయి:
నాలుక చుట్టూ చాలా సున్నితమైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ వేడి పానీయాలు తీసుకోవడం వల్ల మీ రుచి మొగ్గలు కూడా ప్రభావితమవుతాయి. వేడి పానీయాలకు గురైనప్పుడు అవి ఇతర కణాల మాదిరిగానే దెబ్బతింటాయి. క్రమం తప్పకుండా తాగడం, చాలా వేడిగా ఉన్న పదార్థాలు తినడం వల్ల నాలుక పదే పదే తీవ్రంగా కాలిపోతుంది, దీనివల్ల మీ రుచి మొగ్గలను దెబ్బతీస్తాయి. పెదాలను కూడా దెబ్బతీస్తుంది. చాలా సందర్భాలలో పెదవులు కాలిపోతాయి లేదా శారీరకంగా నల్లగా మారుతాయి. మరోవైపు, చాలా వేడి పానీయాలను తరచుగా తీసుకోవడం కూడా గుండెల్లో మంటను కలిగిస్తుంది. అల్సర్ ఉన్నవారు వేడి పానీయాలకు దూరంగా ఉండాలి. వేడి పానీయాలు క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ పొట్టలోని పొర కూడా దెబ్బతింటుంది. చాలా వేడిగా ఉండే టీ లేదా కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్ పలచబడి మన జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.
వేడి ఎంత ఉండాలంటే:
అంతర్జాతీయ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి పానీయం టీ లేదా కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 700 ml వేడి టీ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 90 శాతం పెరుగుతుందని పేర్కొంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) లో 10 దేశాల నుంచి 23 మంది శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలో పాల్గొన్నాయి. అధిక ఉష్ణోగ్రత పానీయాలు, క్యాన్సర్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసి వెల్లడించాయి.