Hypo Tension: భోజనం చేసిన తర్వాత కళ్లు తిరుగుతున్నాయా? అయితే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే.!! - Telugu News - Mic tv
mictv telugu

Hypo Tension: భోజనం చేసిన తర్వాత కళ్లు తిరుగుతున్నాయా? అయితే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే.!!

February 23, 2023

భోజనం చేసిన తర్వాత కళ్లు తిరుగుతున్నాయా? అయితే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే చాలా మంది భోజనం చేయగానే కళ్లు తిరుగుతున్నాయని అంటుంటారు. ఇది పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్ అనే కండిషన్ వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారం తీసుకున్న తర్వాత రక్తపోటు తగ్గడమే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. వయస్సు మీద పడినవారిలో ఇది సాధారణ సమస్య. ఆకస్మాత్తుగా కళ్లు తిరగడం పడిపోతుంటారు. జీర్ణక్రియకు సహాయపడటానికి మెదడు, శరీరం నుంచి రక్తం గట్ కు మారినప్పుడు మెదడుకు రక్త ప్రసరణ తగ్గడంతో రక్తపోటు తగ్గుతుందని తెలిపారు. తక్కువ బ్లడ్ షుగర్, తక్కువ రక్తపోటు, మధుమేహం ఇవన్నీకూడా తిన్నతర్వాత మైకము కలిగిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో మెదడుకు తక్కువగా రక్త ప్రసరణ అవ్వడంతో స్ట్రోక్ కు దారి తీసే అవకాశం ఉంటుంది.

లక్షణాలు:

-ఇది భోజనం చేసిన 30-60 నిమిషాల తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు. వ్యక్తి అకస్మాత్తుగా కూర్చున్న స్థానం నుండి లేచి నిలబడినప్పుడు (ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని పిలుస్తారు) లేదా మరొక విధంగా కూడా జరగవచ్చు.

– మూర్ఛపోవడాన్ని వైద్యపరంగా సింకోప్ అంటారు. బ్రేయిన్ స్ట్రోక్ కూడా దారి తీయవచ్చు.

– కొందరిలో వికారం లేదా వాంతులు కూడా ఉంటాయి. దీనిని ఫుడ్ పాయిజనింగ్ అని తప్పుగా అనుకోవద్దు.

-కొందరు వ్యక్తులు ఆంజినా లేదా ఛాతీ నొప్పితో బాధపడతారు.

– మసక దృష్టి.

– గందరగోళం లేదా దిక్కుతోచని అనుభూతి.

-PPH నుండి వచ్చే సమస్యలలో అవయవ వైఫల్యం..అలాగే తలతిరగడం వల్ల కిందపడిపోవడం వల్ల ఫ్రాక్చర్లు, గాయాలయ్యే ప్రమాదం ఉంది.

ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి:

-భోజనం చేసే ముందు నీరు తాగాలి. ఆహారం లేదా అల్పాహారం తీసుకునే అరగంట ముందు కనీసం 200ఎంఎల్ నీరు తాగాలి.

-తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే అతిగా తింటే…పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్ను ప్రేరేపిస్తుంది.

-అలాంటి సమస్యను నివారించడానికి రోజుకు రెండు లేదా మూడు సార్లు ఆహారం తీసుకునే బదులు 6 లేదా 7 సార్లు తక్కువగా తినడం ప్రయత్నించండి.

-భోజనం చేసిన తర్వాత కళ్లు తిరిగినట్లుగా అనిపిస్తే కాసేపు కూర్చోవాలి లేదంటే పడుకోవాలి.

-సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొహైడ్రేట్టు, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటే ఆహారా పదార్థాలను భోజనంలో చేర్చుకోవాలి.