ఎంబాపెను ఎగతాళి చేసిన అర్జెంటీనా గోల్‌కీపర్ మార్టినెజ్‌పై విమర్శలు
ఫిఫా వరల్డ్ కప్-2022 గెలిచాక అర్జెంటీనా ఆటగాలు ఆనందంలో మునిగితేలుతున్నారు. మూడు దశాబ్ధాల తర్వాత వరల్డ్ కప్ దక్కడంతో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. కప్పుతో తిరిగొచ్చిన ఆటగాళ్లకు స్వదేశంలో ఘన స్వాగతం పలికింది. బ్యూనస్ ఎయిర్స్ వీధుల్లో లక్షలాది అభిమానుల మధ్య పరేడ్ నిర్వహించారు. ఓపెన్ టాప్ బస్సులో ప్రయాణిస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. అయితే ఈ సమయంలో అర్జెంటీనా ఆటగాడు మార్జినెజ్ చేసిన ఓ పని విమర్శలకు తావిస్తోంది. విజయాత్రలో భాగంగా ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపె ముఖం ఫొటో తగిలించిన చిన్న పిల్లాడి బొమ్మను అతను చేతిలో పట్టుకుని ఉండడపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. తోటి ఆటగాళ్లను ఇలా ఎగతాలి చేయడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
అద్భుత ప్రదర్శనతో ఫ్రాన్స్‌ను ఫైనల్ కు చేర్చిన ఎంబాపె..తుది పోరులో అర్జెంటీనాకు కూడా చెమటలు పట్టించాడు. హ్యాట్రిక్ గోల్స్ కొట్టి చివరిలో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అయితే షూటౌట్ లో ఫ్రాన్స్ విఫలం కావడంతో ఓటమి చవిచూసింది.చివరికి ఫెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్ గోల్ అడ్డుకున్న అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.