Argentina lost the match against Saudi Arabia
mictv telugu

సౌదీ చేతిలో ఓడిన అర్జెంటీనా.. మెస్సీపై మేం గెలిచాం

November 22, 2022

Argentina lost the match against Saudi Arabia

సాకర్ ప్రపంచకప్ లో మంగళవారం సంచలనం నమోదైంది. ఫేవరెట్ టీం అయిన అర్జెంటీనా పసికూన సౌదీ అరేబియా చేతిలో 2 – 1 తేడాతో ఓటమి పాలైంది. మొదటి సగం ఆటలో 1 – 0 గోల్స్ తో ఆధిక్యంలో ఉన్న అర్జెంటీనా తర్వాతి సగం మ్యాచులో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. సౌదీ రెండు గోల్స్ చేసి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ గెలుపుతో సౌదీ అభిమానులు పండుగ చేసుకున్నారు. మ్యాచ్ అయిపోగానే ‘మెస్సీ ఎక్కడ.. మేం అతడిని ఓడించాం’ అంటూ సంబరాలు జరిపారు. ఓటమి అనంతరం మెస్సి షాకులో అలాగే ఉండిపోయాడు. ఇక ఈ మ్యాచులో మెస్సీ ఓ రికార్డు నమోదు చేశాడు. వరుసగా నాలుగు ఫిఫా వరల్డ్ కప్ లలో గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఇప్పటివరకు వరుసగా 36 మ్యాచులను గెలుచుకుంటూ వచ్చిన అర్జెంటీనా తాజా ఓటమితో ప్రపంచ రికార్డుకు దూరమైంది. ఇటలీ వరుసగా 37 మ్యాచులు గెలిచి అగ్రస్థానంలో ఉండగా, ఒక్క ఓటమితో అర్జెంటీనా ఆ రికార్డు సాధించే అవకాశం కోల్పోయింది.